: వర్మ కామెంటుకి కంగారుపడ్డ రాజమౌళి!
ఎప్పుడూ ట్విట్టర్ లో ఏదో ఒక విషయంపై, ఎవరో ఒకరిపై, ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు పోస్టు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి దర్శకుడు రాజమౌళిపై కామెంట్ చేశాడు. అది కూడా ఆయన ఇంటి పేరు 'ఎస్ఎస్'పై తనదైన విధంగా పోస్టు పెట్టాడు. "ఎస్ఎస్ అంటే స్టీవెన్ స్పీల్ బర్గ్... నాకీ విషయం ఇప్పుడే తెలిసింది" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో కంగారుపడి వెంటనే స్పందించిన రాజమౌళి.. 'జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సర్, ఇప్పుడిది?' అంటూ పోస్ట్ పెట్టాడు. వాళ్లిద్దరి ట్విట్టర్ వ్యాఖ్యలు చూసి మిగతావాళ్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.