: ప్రతి గంటకు ఒక రహస్య సెక్స్ వీడియో అప్ లోడ్ అవుతోంది: మేధావుల ఆందోళన


దేశంలో ప్రతి గంటకు రహస్య కెమెరాతో చిత్రీకరించిన సెక్స్ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ లో లైంగిక దుర్వినియోగం, భారతీయ మహిళలు, పిల్లలపై ప్రభావం అనే అంశంపై బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ సదస్సులో జాతీయ సైబర్ భద్రత మరియు భద్రతా ప్రమాణాల అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ అమర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడేళ్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా సెక్స్ వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయని తెలిపారు. అన్ లైన్ సెక్స్ గేమ్స్ ను ఆయన అతి పెద్ద ప్రమాదంగా అభివర్ణించారు. ఇవి మహిళలు, పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు. ప్రతి ఏటా 7200 మంది చిన్నారులు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన వెల్లడించారు. దీనిని అరికట్టేందుకు కఠిన చట్టాలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రభుత్వ ఐటీ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News