: రూట్ చెప్పలేదని బయటకు తోసేసి...కారుతో తొక్కించేశాడు!


ఉబెర్ క్యాబ్స్ సంస్థను మరోడ్రైవర్ వార్తల్లో నిలిచేలా చేశాడు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ కు చెందిన సాషా ఎప్పట్లానే ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఇంటికి వచ్చింది. డ్రైవర్ కు అడ్రెస్ చెప్పిన సాషా జీపీఎస్ లో నమోదు చేయమంది. దానికి అంగీకరించని డ్రైవర్ అడ్రస్ చెబితే తీసుకెళ్తానని చెప్పాడు. మార్గాన్ని చెబుతున్న ఆమెకు ఇంతలో ఫోన్ రావడంతో, అందులో మునిగిపోయిన సాషా డ్రైవర్ కు రూట్ చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ ఆమెను కారు నుంచి బయటకు తోసేసి, బండ బూతులు తిట్టాడు. సాషా షాక్ లో ఉండగానే, ఆమె కాలుపై నుంచి కారును నడిపించాడు. దీంతో ఆమె కాలు కారు చక్రం కింద నలిగిపోవడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రిలో చేరింది. అక్కడి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజూ క్యాబ్ లో ప్రయాణిస్తున్నా ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని బాధపడుతూ ఆమె పోలీసులకు చెప్పుకుంది.

  • Loading...

More Telugu News