: గో మాంసానికి ఖురాన్ కూడా వ్యతిరేకమే: గుజరాత్ సర్కార్ బిల్ బోర్డులు


ఆరోగ్యానికి బీఫ్ మంచిది కాదని ఖురాన్ చెబుతోందంటూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం బిల్ బోర్డులు ఏర్పాటు చేసింది. గో సంరక్షణ నిమిత్తం ఈ బిల్ బోర్డులను అహ్మదాబాద్ ప్రాంతంలో పెట్టారు. ఈ బిల్ బోర్డులపై గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ చిత్రం, ముస్లింల సింబల్ నెలవంక, నక్షత్రం ఉన్నాయి. గోసేవ, 'గోచార్ వికాస్ బోర్డు'లు ఈ ప్రకటనలు ఉన్న బిల్ బోర్డులను ఏర్పాటు చేశాయి. కృష్ణాష్టమి సందర్భంగా వీటిని ఏర్పాటు చేశారు. గోవులను గౌరవించండి..వాటి పాలు, నెయ్యి, వెన్న ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఎన్నో రోగాలకు కారణం ఆవు మాంసం.. అంటూ ఆ ప్రకటనలో రాశారు. అయితే, గోమాంసం ఆరోగ్యానికి మంచిది కాదని ఖురాన్ లో ఉందన్న విషయాన్ని ముస్లిం పెద్దలు ఖండించారు.

  • Loading...

More Telugu News