: పదిహేనేళ్ల క్రితం కొన్న జీన్స్ ఇప్పటికీ ధరిస్తాను!: సల్మాన్ ఖాన్


తనకు స్టార్ లా ఉండటం నచ్చదని చెబుతున్నాడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. కేవలం తెరపై నటించే పాత్రల వల్లే తనకు స్టార్ ఇమేజ్ వచ్చిందని, నిజజీవితంలో అదేమీ ఉండదని అంటున్నాడు సల్మాన్. చాలా సాధారణంగా, మామూలుగా ఉండేందుకే ఇష్టపడతానని సల్మాన్ తెలిపాడు. తానీ స్థానంలో ఉన్నానంటే అభిమానులే అందుకు కారణమని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాను ధరించే టీషర్ట్ ధర రూ.550 మాత్రమేనని, 15 సంవత్సరాల క్రితం కొన్న జీన్స్ ప్యాంట్, 20 సంవత్సరాల కిందట కొన్న షూస్ ఇప్పటికీ ధరిస్తానని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 25 ఏళ్ల తరువాత తనకిప్పుడు సినిమా స్క్రిప్టులను ఎంచుకునే స్వేచ్ఛ వచ్చిందన్నాడు. దర్శకుడు సూరజ్ బర్ జాత్యా, దీపక్ బారీ, తన తండ్రి సలీంఖాన్ తదితరుల మార్గదర్శకత్వంలో తానీ స్థితికి వచ్చానని సల్మాన్ పేర్కొన్నాడు. తనను బాగా తెలిసిన సన్నిహితులు విమర్శలు చేస్తే తప్ప ఇతరుల మాటలను పట్టించుకోనని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News