: ఎంత ఆనందం... శ్రీశైలానికి జలకళ!
తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు శుభవార్త. కాస్తంత ఆలస్యంగానైనా మాగాణి భూములకు నీరందే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రా నదిలో వరద కొనసాగుతుండటం, సోమశిల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు వస్తోంది. దీంతో చానాళ్లుగా నీళ్లు లేక వెలవెలబోయిన జలాశయం కళకళలాడటం మొదలైంది. ప్రస్తుతం శ్రీశైలానికి 95,840 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇదే ప్రవాహం కొనసాగితే, వారం రోజుల్లో డ్యాం నిండుతుందని అధికారులు వెల్లడించారు. కనీసం రెండు మూడు రోజుల ప్రవాహం ఉంటే, కుడి, ఎడమ కాలువలకు నీటి సరఫరాకు ఆటంకాలు తీరుతాయి.