: ఆ చీమలకు అసలు ఏమైంది?
ఐ పోన్లు మనుషులనే కాదు, చీమల్ని కూడా ఆకర్షిస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ ఐ ఫోన్ వద్ద చీమలు బిజీబిజీగా తిరుగుతుంటాయి. ఇంతలో ఐ ఫోన్ రింగవ్వడం ప్రారంభం కాగానే, చీమలన్నీ కలసి ఆ ఐ ఫోన్ చుట్టూ గుండ్రంగా తిరగడం మొదలు పెడతాయి. ఫోన్ రింగవుతున్నంత సేపు చీమలు పిచ్చెక్కినట్టు దాని చుట్టూ తిరగడం విశేషం. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆగస్టు 30న దీనిని యూట్యూబ్ లో పెట్టగా, ఇప్పటివరకు 30 లక్షల మంది దీనిని వీక్షించారు. వైబ్రేషన్ వల్ల అలా తిరుగుతున్నాయని కొంత మంది పేర్కొంటుండగా, విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం వాటిపై పడిందని, అందుకే అవి అలా ప్రవర్తిస్తున్నాయని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.