: పగ్గాల కోసం రాహుల్ ఏడాది ఆగాల్సిందే...పార్టీ చీఫ్ గా సోనియాను కొనసాగించాలని సీడబ్ల్యూసీ తీర్మానం
కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టేందుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో ఏడాది పాటు వేచి చూడక తప్పదు. ఎందుకంటే, పార్టీ అధినేత్రిగా మరో ఏడాది పాటు సోనియా కొనసాగనున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానించింది. సోనియా గాంధీ నేతృత్వంలో నేటి ఉదయం భేటీ అయిన సీడబ్ల్యూసీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఏకే ఆంటోనీ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. భేటీలో భాగంగా ఏడాది పాటు సోనియానే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగించాలని నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.