: షీనా బోరా కేసులో కీలక పరిణామం... దర్యాప్తు బాధ్యత వహిస్తున్న కమిషనర్ కు పదోన్నతి, బదిలీ!
షీనా బోరా కేసులో జరుగుతున్న దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాకు పదోన్నతి కల్పించారు. ఆయనను హోంగార్డ్స్ డీజీగా నియమిస్తూ ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కమిషనర్ గా అహ్మద్ జావేద్ నియమితులయ్యారు. మారియాతో సహా నలుగురు పోలీస్ అధికారులను బదిలీ చేశారు. అయితే బోరా హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుండగా మధ్యలో అకస్మాత్తుగా కమిషనర్ కు పదోన్నతి కల్పించడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. సాధారణ ప్రమోషన్లలో భాగంగానే మారియా డీజీగా నియమితులయ్యారని ముంబై పోలీసు వర్గాలంటున్నాయి.