: ‘పెగ్గు’ అందించలేదని పనిలో నుంచి తీసేశారట...అమెరికన్ ఎయిర్ లైన్స్ పై ముస్లిం మహిళ ఫిర్యాదు


ముస్లిం కుటుంబానికి చెందిన ఆ మహిళ ఎయిర్ హోస్టెస్ గా విధుల్లో చేరింది. మూడేళ్ల పాటు నిర్విఘ్నంగా పనిచేసింది. ఒకానొక రోజు ఆమెను విధుల్లో నుంచి తప్పిస్తూ ఆమెకు ఉద్యోగం ఇచ్చిన సంస్థ నిర్ణయం తీసుకుంది. నన్నెందుకు పనిలో నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించగా, ఆ సంస్థ చెప్పిన కారణం విన్న ఆ మహిళ షాక్ తింది. వెనువెంటనే తేరుకుని సదరు ఎయిర్ లైన్ సంస్థపై కోర్టుకెక్కింది. అసలు ఆమె ఉద్యోగం పోవడానికి కారణమేంటంటే... విమాన ప్రయాణాల్లో భాగంగా ప్రయాణికులకు మద్యం సరఫరా చేసేందుకు ఒప్పుకోకపోవడమేనట! వివరాల్లోకెళితే... అమెరికాకు చెందిన ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ సంస్థలో ఆ దేశ నగరం డెట్రాయిట్ కు చెందిన చారీ స్టాన్లే అనే ముస్లిం మహిళ ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. చిన్న కారణాన్ని చూపి తనను ఉద్యోగం నుంచి తొలగించిన ఎక్స్ ప్రెస్ జెట్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్టాన్లే, ‘ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపార్చునిటీస్ కమిషన్’కు ఫిర్యాదు చేసింది. తన మత విశ్వాసాలకు విరుద్ధంగా తానెలా మద్యం సరఫరా చేస్తానని కూడా స్టాన్లే తన పిటిషన్ లో పేర్కొంది. అయితే ప్రయాణికులకు సేవలందించే క్రమంలో మద్యం సరఫరా మామూలేనని ఎక్స్ ప్రెస్ జెట్ వాదిస్తోంది. మద్యం సరఫరా చేయమని స్టాన్లేను ఆదేశిస్తే, ఆమె వేరే అటెండెంట్ కు పనిని అప్పజెప్పే అవకాశముందని, దానిని సద్వినియోగం చేసుకోకుండా ఆమె మద్యం సరఫరాకు నిరాకరించిందని ఆ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News