: మాపై దాడికి ఐఎస్ఐఎస్ కుట్ర పన్నింది... ఆధారాలు కూడా ఉన్నాయి: ఫ్రాన్స్
తమపై ఉగ్ర దాడులు చేయడానికి ఐఎస్ఐఎస్ కుట్రలు పన్నిందని... దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఫ్రాన్స్ వెల్లడించింది. మరోవైపు సిరియా, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాల నుంచి తరలి వస్తున్న శరణార్థులకు తాము అండగా ఉంటామని తెలిపింది. ఈ ఏడాది 24 వేల మంది శరణార్థులకు ఆశ్రయం ఇస్తామని చెప్పింది. యుద్ధ బాధితులను ఆదుకుంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొల్లాండే ప్రకటించారు. శరణార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ పేర్కొన్నారు. ఇది జరిగిన కాసేపటికే ఫ్రాన్స్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.