: కురిసిన ప్రతి చినుకును ఒడిసిపట్టండి... అధికారులకు చంద్రబాబు ఆదేశం
నేలపై పడ్డ ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెడు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన ఏపీ అధికార యంత్రాంగంతో కొద్దిసేపటి క్రితం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూమిపై పడ్డ ప్రతి వర్షపు చినుకును వృథాగా పోనీయకుండా ఒడిసిపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తద్వారా భూగర్భ జల వనరులను పెంపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇంకుడు గుంతల పథకాన్ని చేపట్టడమే కాక, నీటి పొదుపుపై భారీ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.