: పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన ప్రధాని మోదీ


భారత ప్రధాని మోదీ ఈ ఉదయం పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీతో పాటు 40 మంది పారిశ్రామికవేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తదితరులు కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 'ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు - భారత్ కు గల అవకాశాలు' అనే అంశంపై చర్చించారు. చైనా ఆర్థిక పరిస్థితి మందగించిన నేపథ్యంలో ఈ భేటీని నిర్వహించారు. స్టాక్ మార్కెట్ల నష్టాలపై కూడా ఈ భేటీలో చర్చించారు. జూన్ 30న కూడా పారిశ్రామికవేత్తలతో మోదీ భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News