: మన దేశంలో ఎన్ని చిరుతలు ఉన్నాయో తెలుసా?


మన దేశంలో ఎన్ని చిరుత పులులు ఉన్నాయో లెక్క తేలింది. తొలిసారి నిర్వహించిన చిరుతల గణనలో మొత్తం 7,910 చిరుతలు ఉన్నాయని నిర్ధారణ అయింది. అయితే ఈశాన్య రాష్ట్రాలను ఈ లెక్కింపుకు సంబంధించి పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న చిరుతలను కూడా లెక్కించలేదు. దీంతో, దేశ వ్యాప్తంగా చిరుతల సంఖ్య 12 వేల నుంచి 14 వేల వరకు ఉంటుందని ఈ గణనలో ప్రధాన భూమిక పోషించిన యధువేంద్రదేవ్ ఝలాలా తెలిపారు. మొత్తం 3.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ లెక్కింపు జరిగింది. ఎక్కువ చిరుతలున్న జాబితాలో మధ్యప్రదేశ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ రాష్ట్రంలో 1,817 చిరుతలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 343 చిరుతలు ఉన్నాయని తేలింది. పెద్ద పులులను లెక్కించడానికి అవలంబించిన విధానాన్నే చిరుతల లెక్కింపుకు కూడా అవలంబించారు.

  • Loading...

More Telugu News