: సిరియా శరణార్థులను ఆదుకోండి... ప్రపంచ దేశాలకు హిల్లరీ క్లింటన్ వినతి
అంతర్యుద్ధ ప్రభావంతో నిలువ నీడ కోల్పోయిన సిరియా శరణార్థులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరం శరణార్థులకు సాయం చేయాలని కోరుకోవాలన్నారు. సివిల్ వార్ నుంచి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలని యూరప్ దేశాలకు వస్తున్న వారికి రక్షణగా నిలవాలని క్లింటన్ సూచించారు. ఒకవేళ వారికి ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి ఉన్న దేశాలు వారికి ఆర్థికపరమైన సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా పెట్రోలియం సంపద ఎక్కువగా ఉన్న సంపన్న దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలు ఆ విషయంలో ముందుకు రావాలని హిల్లరీ సూచించారు. మరోవైపు ఇప్పటికే అనేకమంది ఇరాక్, సిరియా శరణార్థులకు జర్మనీ వసతులు కల్పిస్తోంది.