: బీహార్ ‘గంట’ మోగనుంది... కేంద్ర ఎన్నికల సంఘం భేటీ ప్రారంభం
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ ఎన్నికల నగారా మరికాసేపట్లో మోగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా సమావేశమైంది. ఇప్పటికే అటు బీహారీ పార్టీలతో పాటు కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన బీజేపీ ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. నేడో, రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల సంఘం భేటీ నేపథ్యంలో నేటి సాయంత్రంలోగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ ఎన్నికల షెడ్యూల్ పై తుది కసరత్తు కోసమే ఎన్నికల సంఘం భేటీ జరుగుతోందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం భేటీపై అటు బీహారీ పార్టీలతో పాటు బీజేపీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.