: పగ పడతాం.. కక్ష సాధిస్తాం: కలకలం రేపుతున్న చెవిరెడ్డి హెచ్చరికలు


వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆయన నిన్న అధికార వర్గాలపై ఒంటికాలిపై లేచారు. అంతేకాక ఘాటు పదజాలంతో కూడిన హెచ్చరికలు జారీ చేసిన ఆయన అధికార వర్గాల్లో పెద్ద చర్చకే తెరతీశారు. గత నెల వైసీపీ రాష్ట్ర బంద్ సందర్భంగా అరెస్టైన జక్కంపూడి రాజా నిన్న జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీలో చెవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘అధికార పార్టీ అండతో న్యాయాన్ని విస్మరించి ప్రవర్తించే అధికారులపై పగబట్టి కక్షసాధింపు చర్యలకు దిగుతాం. అధికారులు పద్ధతి తప్పితే ఈ రోజు బాగానే ఉంటుంది. భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా పశ్చాత్తాపపడేలా చర్యలుంటాయి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీడీపీ ప్రభుత్వ పతనం దగ్గర్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News