: ఢిల్లీలో సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం


ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాల నుంచి సోనియా పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఇప్పుడు దాన్ని మరో సంవత్సరం పొడిగించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News