: రూ. 425 కోట్లకు భవంతిని కొనుగోలు చేసిన కుమార మంగళం బిర్లా... ఆల్ టైం రికార్డు


భారత నిర్మాణ రంగ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ముంబై లోని మలబార్ హిల్ పై ఉన్న 'జతియా హౌస్' పాత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక ధరకు అమ్ముడైంది. దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ భవనాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా రూ. 425 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. నిన్న జరిగిన వేలంలో ఆయన ఈ బిల్డింగ్ ను దక్కించుకున్నాడు. ఇదే ప్రాంతంలోని మహేశ్వరి హౌస్ 2011లో రూ. 400 కోట్లకు అమ్ముడు కాగా, జతియా హౌస్ కు అత్యంత సమీపంలోని హోమీ బాభా హౌస్ గత సంవత్సరంలో రూ. 372 కోట్లకు అమ్ముడుపోయింది. ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా 10 శాతం మొత్తాన్ని బిర్లా చెల్లించారని, మిగతాది త్వరలోనే ఇవ్వనున్నారని వేలం నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసెల్లీ వివరించారు. ఇక్కడ ఉన్న భవంతి పాతదే అయినా, మొత్తం 2,926 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పెద్ద పార్కింగ్ ప్రాంతం, నిండైన పచ్చదనంతో నిండివుందని, అందువల్లే దీనికి ఇంత రేటు పలికిందని రియల్ ఎస్టేట్ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News