: హైదరాబాదులో ల్యాండైన రాజ్ నాథ్ సింగ్...స్వాగతం పలికిన గవర్నర్, టీఎస్ హోం మినిస్టర్


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో ల్యాండైన రాజ్ నాథ్ సింగ్ కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘన స్వాగతం పలికారు. హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఎస్ఏ)లో శిక్షణ పూర్తి చేసుకున్న కమాండెంట్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో రాజ్ నాథ్ పాల్గొంటారు. కమాండెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్న రాజ్ నాథ్, వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News