: పొడుగు కాళ్లతో రికార్డుల కెక్కిన అమ్మడు!


ఆమె పొడుగు కాళ్ల అందగత్తె. 49 అంగుళాల పొడవు కాళ్లతో అమెరికాలో రికార్డుల కెక్కిన ఆ అమ్మడి పేరు లారెన్ విలియమ్స్. 26 సంవత్సరాల వయస్సు. టెక్సాస్ కు చెందిన విలియమ్స్ తనకు స్పోర్ట్స్ అంటే మహా ఇష్టమంటుంది. తన కుటుంబంలో అందరూ 6 అడుగుల వాళ్లే ఉన్నారుట. అందుకే తనకూ పొడుగాటి కాళ్లు ఉన్నాయని అంటోంది. కాగా, గతంలో న్యూయార్క్ కు చెందిన మోడల్ బ్రూక్ బ్యాం కర్ పొడుగు కాళ్లున్న అమ్మాయిగా రికార్డులో ఉంది. ఆ రికార్డును 3 అంగుళాల తేడాతో విలియమ్స్ అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News