: కుర్రకారు జేబులు ఖాళీ చేస్తున్న కిలాడీ అమ్మాయిలు!
డబ్బు సంపాదించడంలో ఆ కిలాడీ అమ్మాయిల టాలెంటే వేరు. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ను ఆధారంగా చేసుకుని.. అదీ, ప్రొఫైల్ లో వాళ్ల ఫొటోలను పెట్టకుండా, అందమైన అమ్మాయిల ఫొటోలను ఉంచి కుర్రకారుకు మస్కా కొట్టించారు ఇద్దరు అమ్మాయిలు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. బాధితులైన యువకులు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడిందని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ అమ్మాయిలకు ఒక్కొక్కరికీ సుమారు 15 నుంచి 20 ఫేస్ బుక్ అకౌంట్లు ఉన్నాయి. వారి ఫోన్ నంబర్లు కూడా అందులో ఉంచారు. ప్రొఫైల్ ఫొటోలు అందంగా ఉండటం, ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది యువకులు వీరిద్దరినీ ఫ్రెండ్స్ గా యాడ్ చేసుకున్నారు. అందిన మేరకు కుర్రాళ్ల వద్ద నుంచి డబ్బులు, విలువైన వస్తువులు తీసుకోవడంలో వాళ్లు ఆరితేరిపోయారని డీసీపీ వివరించారు. మరో విషయం ఏమిటంటే, ఇద్దరమ్మాయిలు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఈ తరహా పనులకు పాల్పడుతున్నారని డీసీపీ పేర్కొన్నారు.