: లండన్ లో కోడెల, బొజ్జల
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు లండన్ లో సందడి చేశారు. టీడీపీ లండన్ విభాగం నేతలు, కార్యకర్తలతో వారు భేటీ అయ్యారు. వారితో పాటు కోడెల కుమారుడు శివరాం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా యువ పారిశ్రామికవేత్తలతో కూడా వారు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని, మంచి అవకాశాలు ఉన్నాయని సమావేశంలో కోడెల చెప్పారు. తెలిసిన వాళ్లను కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు.