: కేసీఆర్ చెప్పిందే జగన్ చేస్తున్నారు: మంత్రి కామినేని


టీడీపీ, బీజేపీల బంధాన్ని తెగ్గొట్టాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందుకే ఇరుపక్షాలను రెచ్చగొట్టేలా కొందరు నేతలు యత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే వైకాపా అధినేత జగన్ చేస్తున్నారని కామినేని మండిపడ్డారు. ఇద్దరూ కలసి ఒక ప్రణాళిక ప్రకారం కుట్రలు చేయడం, బురద చల్లడం వంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలుత బీజేపీకి దగ్గర కావాలని యత్నించి, ఇప్పుడు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీలను విడగొట్టాలనే సింగిల్ అజెండాతో జగన్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీలను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News