: జ్యూరిచ్ లోని పురాతన శాకాహార హోటల్లో వడ, సాంబారు


జ్యూరిచ్ లోని ఓ హోటల్ లో భారతీయ వంటకాలు లభ్యమవుతున్నాయి. వడ, సాంబారు, పాలక్ పన్నీర్ తదితర రకాలు ఎంచక్కా తినొచ్చు. స్విట్జర్లాండ్ లో ఉన్న ఈ హోటల్ సాదాసీదాది కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శాకాహార హోటల్. దీనిని 1898లో హాన్ హిల్ట్ అనే ఆయన జ్యూరిచ్ లో స్థాపించారు. పురాతన చరిత్ర ఉన్న ఈ హోటల్ 2012లో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కింది. కేవలం మనదేశ వంటకాలే కాదు, గ్రీక్, థాయ్, లెబనాన్ తదితర దేశాల ఆహారాలు అక్కడ లభిస్తాయి. హిల్ట్ నాలుగో తరం వారసులు హోటల్ ను ప్రస్తుతం నడుపుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ హోటల్ లోనే భోజనం చేశారని సమాచారం.

  • Loading...

More Telugu News