: ఏపీలో ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపు వివరాలు
విజయవాడలో కొన్నిరోజుల కిందట నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ గౌరవ వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ ఛైర్మన్ నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు వేతనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్ కు రూ.7,500 నుంచి రూ.40వేలకు, జడ్పీటీసీలకు రూ.2,250 నుంచి రూ.6వేలకు, ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.6వేలు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.3వేలకు, సర్పంచులకు రూ.1000 నుంచి రూ.3వేలకు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.