: చిట్టీల రాణి ఆస్తులు జప్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం


హైదరాబాద్ లో చిట్టీల పేరుతో పలువురిని మోసం చేసిన బుల్లితెర నటి విజయరాణి ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం జప్తు చేసింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమెపై అధికారులు చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చిట్టీల పేరుతో పలువురు జూనియర్ ఆర్టిస్టులను రూ.10 కోట్ల వరకు మోసంచేసి ఉడాయించింది. ఆమెపై హైదరాబాద్ క్రైం బ్రాంచ్ లో ఫిర్యాదు చేయడంతో బెంగళూరులో ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News