: 'డీడీఎల్' యానిమేటెడ్ వీడియోతో రైలు ప్రమాదాల నివారణకు అవగాహన


రైలు ప్రమాదాలు నివారించేందుకు ప్రకటనల రూపంలో, సందేశాల రూపంలో ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంటుంది. అయినా సినిమాల్లో చూపించే కొత్త రకమైన రిస్కీ సన్నివేశాలను అనుకరిస్తూ, కదులుతున్న రైలును పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కడం వంటి సాహసాలు చేస్తూ పలువురు ప్రమాదాల బారిన పడుతుంటారు. దాదాపు చాలా ప్రమాదాలు ఇలానే జరుగుతుంటాయి. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' సినిమాలో కాజోల్ పరిగెత్తుతుంటే షారుక్ రైలు తలుపు దగ్గర నిలబడి తనకి చేయందించి రైలెక్కిస్తాడు. ఈ సన్నివేశం చాలామందికి ప్రేరణనివ్వడంతో అనేకమంది దీనిని అనుసరించి ప్రమాదాలు కొనితెచ్చుకున్నారు కూడా. అందుకే యూపీ రైల్వే పోలీసులు రైల్వే ప్రమాదాలను నివారించేందుకు కొత్త పంథా ఎంచుకున్నారు. ఈ సినిమా ఆధారంగానే ఓ వీడియో తీశారట. అలా సినిమాలో కాకుండా కొన్ని మార్పులు చేసి 1.9 నిమిషాల యానిమేటెడ్ సీన్ ను రూపొందించారు. ఈ వీడియోలో అమ్మాయి పట్టు జారి, రైలు కింద పడిపోయి చనిపోతే, అబ్బాయి వెనుక భాగం స్తంభానికి తగిలి మరణిస్తాడు. అంటే సినిమాల్లో చూసేందుకే బాగుండే వాటిని నిజజీవితంలో అనుసరించవద్దని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు అటువంటి ప్రయత్నాలు చేయొద్దని కోరుతూ వాట్సాప్ లో షేర్ చేస్తున్నారు. ఇదే వీడియోని షారుక్, కాజోల్ కి కూడా పంపి, వారి అభిమానులు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు ఇవ్వాలని కోరుతూ లేఖలు పంపబోతున్నట్టు యూపీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News