: పోలవరం ముంపు మండలాల ఉద్యోగులకు తెలంగాణలో పోస్టులు
రాష్ట్ర విభజనతో సందిగ్ధంలో పడ్డ ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల ఉద్యోగులకు పోస్టులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయా మండలాల్లోని ఉద్యోగులకు పోస్టులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. 233 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఉద్యోగాలివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన వారికి రెండో దశలో ఉద్యోగాలివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో ముంపు మండలాల ఉద్యోగులకు ఊరట లభించింది.