: చైనా సరిహద్దులకు భారీగా సైనికులు.. ఏం జరుగుతోంది?


నియంత్రణ రేఖను దాటుకుని జమ్మూకాశ్మీర్ రాష్ర్టంలో మన దేశ సరిహద్దుల్లోకి 10 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చి చైనా సైనికులు సాహసానికి ఒడిగట్టారు. వీరి అక్రమణను భగ్నం చేయడానికి ఆర్మీ జవాన్లు భారీగా చైనా సరిహద్దులకు తరలిపోయారని సమాచారం. అన్ని కిలోమీటర్ల మేర చొచ్చుకు రావడంతోపాటు అక్కడ టెంట్ వేసి క్యాంప్ వేయడం మన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. దీనిపై ఇప్పటికే మన దేశం నిరసన కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆక్రమణ విషయాన్ని చర్చించేందుకు రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఫ్లాగ్ మీటింగ్ ఈ రోజు జరుగుతోంది.

వాస్తవానికి ఈ ఆక్రమణ చాలా ఆందోళనకరమైన విషయం కావడంతో దీనికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించవద్దని కేంద్రం సైన్యాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. చైనా సైనికుల ఆక్రమణతో నిద్రమత్తు వీడిన ఆర్మీ.. పర్వతాలలో యుద్ధ విద్యా శిక్షణ పొందిన సైనికులను లడక్ లోని దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ కు తరలించింది.

  • Loading...

More Telugu News