: ఒళ్లు దగ్గర పెట్టుకోండి...లేదంటే మీకూ కష్టాలు తప్పవు: టీఆర్ఎస్ నేతలకు దానం వార్నింగ్


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఘాటు పదజాలంతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. పాలమూరు జడ్పీ సమావేశంలో తమ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడికి నిరసనగా నేడు టీ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. హైదరాబాదులో జరిగిన ఆందోళనలో పాల్గొన్న సందర్భంగా దానం నాగేందర్ అధికార పార్టీ నేతల వైఖరిపై నిప్పులు చెరిగారు. ‘‘టీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. లేకపోతే అధికారం పోయాక వారికీ ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడులను ఇక ఎంతమాత్రం సహించేది లేదు’’ అని దానం ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News