: ఏపీలో పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ ఫిర్యాదుల వెల్లువ... ‘హోదా’ కోసం మొదలైన కాంగ్రెస్ పోరు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ మలిదశ ఉద్యమం ఊపందుకుంది. నేటి ఉదయమే ఆ పార్టీ నేతలు అన్ని జిల్లాల్లో రోడ్లపైకి వచ్చారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను ఇవ్వకుండా, విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రధాన నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులపై కేసులు నమోదు చేయాలని ఆ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పట్టని సీఎం నారా చంద్రబాబునాయుడిపైనా కేసులు పెట్టాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. విజయవాడలో దేవినేని నెహ్రూ, విశాఖలో ద్రోణంరాజు సత్యనారాయణ, భీమరంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతారాం తదితరులు ఇప్పటికే వారి వారి నగరాల్లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడలో దేవినేనితో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన కుమారుడు దేవినేని అవినాశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

  • Loading...

More Telugu News