: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఈ రోజు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. వైఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావులు వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి దర్శనం చేసుకున్నారు. అటు 'ఒకరికి ఒకరు' చిత్రం హీరో శ్రీరామ్ దంపతులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తరువాత వారందరికీ ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News