: వేలానికి ఆపిల్ తొలితరం కంప్యూటర్
తొలినాళ్లలో ఆపిల్ నుంచి తయారైన ఓ కంప్యూటర్ ను వేలం వేయబోతున్నారు. ఈ నెల 21న న్యూయార్క్ లోని బన్ హామ్స్ లో వేలం నిర్వహిస్తారు. వేలం ప్రారంభ ధర 3,30,000 (రూ.3.3 కోట్లకుపైగా) పౌండ్లుగా నిర్ణయించారు. 1977లో ఆపిల్ సంస్థ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్ తో కలసి ఈ కంప్యూటర్ ను స్వయంగా చేతితో తయారు చేశారట. ఆపిల్-1 మదర్ బోర్డు వినియోగించిన ఈ తొలితరం కంప్యూటర్ ను బైట్ షాప్ అప్పట్లో 437 పౌండ్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికీ ఆ కంప్యూటర్ బాగానే పనిచేస్తుందని, అందుకే వేలంలో పెడుతున్నారని తెలిసింది.