: ఏపీ, తెలంగాణలకు నిధులు పెంచిన మోదీ సర్కారు
పీఎంఎస్జీవై (ప్రధాని గ్రామ సడక్ యోజన పథకం) కింద తెలుగు రాష్ట్రాలకు నిధులను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఏపీకి రూ. 167 కోట్ల వాటా ఉండగా, దాన్ని రూ. 208.70 కోట్లకు, తెలంగాణకు రూ. 122 కోట్ల నిధుల వాటా ఉండగా, రూ. 159.20 కోట్లు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దీంతో ఏపీకి రూ. 41 కోట్లు, టీఎస్ కు రూ. 37 కోట్ల మేరకు నిధులు పెరిగినట్లయింది. తెలంగాణ, ఏపీకి నిధులు పెంచడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వాగతించారు. ఈ నిధులతో పల్లెల్లో విద్య, వైద్యం, సామాజిక సంబంధాలు, సేవలు విస్తృతమవుతాయని ఆయన వెల్లడించారు.