: నానా పటేకర్ ఆపన్న హస్తం... ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చేయూత


భారత సినీ వినీలాకాశంలో నానా పటేకర్ కు విలక్షణ నటుడిగా పేరుంది. నటనలోనే కాదండోయ్, ఆపన్న హస్తం అందించడంలోనూ అతడు తన విలక్షణతను చాటుకున్నాడు. మహారాష్ట్రలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నల కుటుంటాలకు ఆర్థిక తోడ్పాటునందించాడు. తన సహచర నటుడు మకరంద్ అనాస్ పెరెతో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమానికి నానా పటేకర్ నిన్న శ్రీకారం చుట్టాడు. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతానికి చెందిన లాతూర్, ఉస్మానాబాదు జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 113 మంది రైతుల కుటుంబాలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాడు. ‘‘కరవు కళ్లెర్రజేసుకుని ఉరిమురిమి చూస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్, నారాయణ్ రాణే లాంటి నేతలు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ దుర్భర పరిస్థితిపై పోరు చేయాలి’’ అని పటేకర్ ఈ సందర్భంగా కోరాడు.

  • Loading...

More Telugu News