: బర్త్ డే గిఫ్ట్ గా ‘కిలో ఉల్లి’... వంద మందికి పంపిణీ చేసిన వరంగల్ కాంగ్రెస్ నేత
ఆకాశాన్నంటిన ఉల్లి ధర నేపథ్యంలో వినూత్న గిఫ్ట్ లు, ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. తమ సైట్ ద్వారా సరుకులు కొంటే రూపాయికే కిలో ఉల్లి ఇస్తామని మొన్నటికి మొన్న బెంగళూరుకు చెందిన ఆన్ లైన్ షాపింగ్ సైట్ వినూత్న ఆఫరిచ్చింది. తాజాగా తన జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు పేదలకు కిలో ఉల్లి చొప్పున గిఫ్ట్ గా అందజేశారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ఇనుగాల వెంకట్రాంరెడ్డి నిన్న గీసుకొండ మండలంలో ఈ వినూత్న బహుమతులకు తెర తీశారు. తన జన్మదినం సందర్భంగా మండలంలోని ధర్మారం గ్రామంలో వంద మందికి కిలో ఉల్లి చొప్పున ప్రత్యేక ప్యాకెట్లను ఆయన అందజేశారు.