: ‘పల్లె’కు తప్పిన ప్రమాదం... ర్యాష్ డ్రైవింగ్ పై కారు డ్రైవర్ కు గన్ మెన్ల క్లాసు!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిన్న పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కదిరి నుంచి అనంతపురం బయలుదేరిన సందర్భంగా ఆయన కారు, మార్గమధ్యంలో బత్తలపల్లి నుంచి కదిరి వైపు వెళుతున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కారు అద్దం పగిలిపోయింది. మంత్రి కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన మంత్రి గన్ మెన్లు కారు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కుదరదని క్లాస్ పీకారు. అయితే ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.