: కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్లే బీజేపీకి అధికారం వచ్చింది: ములాయం
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటారని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు పేరుంది. అయితే, అదే ములాయం సింగ్ ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ పైనే విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టారు. కాంగ్రెస్ పార్టీ అవలంబించిన తప్పుడు విధానాల వల్లే బీజేపీకి అధికారం దక్కిందని ఆయన మండిపడ్డారు. కొన్ని లౌకిక పార్టీలు కూడా బీజేపీకి సహకరించాయని చెప్పారు. కేవలం సమాజ్ వాదీ పార్టీ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా బలంగా పోరాడిందని అన్నారు. 2017లో ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్ వాదీ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆత్వవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.