: ఇంద్రాణిని సొంత నివాసానికి తీసుకెళ్లిన పోలీసులు
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోరోజులో ఆమె పోలీస్ కస్టడీ ముగుస్తోంది. ఈ సమయంలో, ఊహించని విధంగా పోలీసులు ఆమెను తన సొంత నివాసానికి తీసుకెళ్లారు. వర్లీలో ఉన్న ఆమె నివాసం నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడ గంట సేపు విచారించారు. షీనాను హత్య చేసిన రోజు ఆమెను ఎక్కడ ఉంచారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఆమెను మళ్లీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.