: భారీ వర్షానికి హైదరాబాదులో కూలిన పురాతన భవనం
హైదరాబాదులో ఈ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మలక్ పేట్, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో దాదాపు గంటన్నర సేపు వర్షం పడింది. దీంతో, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో కాసేపు జనజీవనం స్తంభించింది. అంతేకాదు... భారీ వర్షం వల్ల మలక్ పేటలో ఉన్న ఓ పురాతన భవనం కుప్పకూలింది. అయితే, ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.