: సైకో ఇంజెక్షన్ లలో మందులు, వైరస్ లు లేవు: ఏపీ డీజీపీ


జనాలకు ముఖ్యంగా మహిళలకు నిద్ర లేకుండా చేస్తున్న ఇంజెక్షన్ సైకోకు సంబంధించిన పలు విషయాలను ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. సైకో చేస్తున్న సూది దాడులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇంజెక్షన్ల ద్వారా జనాల్లోకి సైకో ఎలాంటి మందులు కాని, వైరస్ కాని పంపించడం లేదని తెలిపారు. సైకోను పట్టుకోవడానికి పోలీసులు 40 బృందాలుగా విడిపోయి అన్వేషిస్తున్నారని డీజీపీ చెప్పారు. ఇప్పటిదాకా 22 మందికి సైకో ఇంజెక్షన్లు వేశాడు. మహిళలే కాకుండా ఒక ఆటో డ్రైవర్ పై కూడా సైకో దాడి చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News