: విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాల్సి ఉంది: చంద్రబాబు


విశాఖ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరగాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నగరంలో మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ దృష్టి సారించామని తెలిపారు. పోర్టు కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరిగిపోతోందని... అందువల్ల కాలుష్య నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ను అన్ని విధాలా ఉపయోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని అన్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు వారం రోజుల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు. ఈ రోజు విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పైవివరాలను వెల్లడించారు.

  • Loading...

More Telugu News