: కొడుకు జ్ఞాపకాలు వెంటాడడంతో తండ్రి ఆత్మహత్య
కొడుకు జ్ఞాపకాలు వెంటాడటంతో పిచ్చివాడయిపోయిన మెాతె మదనయ్య (60) పురుగుల మందు తాగి తన కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం షెట్పల్లిలో జరిగింది. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మదనయ్య ఒక్కగానొక్క కుమారుడు రవి (30) కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఏడాది అవుతుంది. అప్పటి నుంచి మదనయ్య పిచ్చి వాడయిపోయాడని స్థానికులు తెలిపారు. కొడుకు జ్ఞాపకాలలో మునిగిపోయిన మదనయ్య ఆత్మహత్య చేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.