: హెలికాప్టర్ వదిలి మెట్రో ఎక్కిన మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలితో అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. వివరాల్లోకి వెళితే, షెడ్యూలు ప్రకారం ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వెళ్లాల్సి ఉంది. హెలికాప్టర్ ద్వారా ఆయన వెళతారని అందరూ భావించారు. ప్రధాని కోసం హెలికాప్టర్ కూడా రెడీగానే ఉంది. అయితే, ఊహించని విధంగా ఆయన మెట్రో రైలు ఎక్కారు. జనపథ్ వద్ద మెట్రో రైలు ఎక్కిన మోదీ అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. ఫరీదాబాద్ స్టేషన్ వరకు ఆయన మెట్రోలోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, వీరేంద్ర సింగ్, జితేందర్ సింగ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News