: రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ విమర్శలు: మంత్రి జూపల్లి
రాజకీయ ఉనికి కోసమే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజుల మధ్య జరిగిన వివాదం కేవలం వారి వ్యక్తిగతమైందని ఆయన అన్నారు. రాంమోహన్ రెడ్డి సోదరి, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడిని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జూపల్లి ఆరోపించారు. ఈ వివాదంలో ఎమ్మెల్యేలిద్దరిదీ తప్పు ఉందన్నారు. ఈ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.