: పలువురికి స్ఫూర్తినిస్తున్న బామ్మా-బాత్రూం కథ!


ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే బహిర్భూమికి వెళ్లాలంటే చాలా చిన్నతనంగా, అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో ఈ సమస్య చాలా ఎక్కువుగా ఉంటుంది. బాలికలు, మహిళలు, వృద్ధ మహిళలు, ఎవరికైనా ఈ సమస్య పెద్ద తలనొప్పిగానే ఉంటుంది. దాని నుంచి బయట పడటమనేది, సదరు కుటుంబం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. 102 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక బామ్మ ఈ సమస్యకు ఎట్లా చెక్ పెట్టిందో తెలుసుకుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్ లోని దంతారి జిల్లాలో ఉన్న కోటబడరికి చెందిన కువార్ బాయ్ యాదవ్ తన మేకలను అమ్మివేయగా సుమారు రూ. 22,000 వరకు డబ్బు వచ్చింది. ఆ డబ్బులతో మరుగుదొడ్డి కట్టించుకుంది. ఎన్నో ఏళ్లుగా బహిర్భూమికి వెళ్లాలంటే పడుతున్న అవస్థల నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఆ గ్రామంలోని 450 కుటుంబాల వారు కూడా బామ్మ చేసిన పనితో స్ఫూర్తి పొందారు. తాము కూడా మరుగుదొడ్లు కట్టించుకుంటామని అంటున్నారు. ఆ శతాధిక వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం గ్రామస్థుల్లో చైతన్యం నింపింది.

  • Loading...

More Telugu News