: 'సూదిగాడు' కథనాలపై మీడియాకు ఏపీ డీజీపీ క్లాస్!
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు సూదులు గుచ్చుతున్న సైకో విషయంలో మీడియా సంయమనం పాటించాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు కోరారు. ఈ సైకో సూదిగాడి వ్యవహారాన్ని పెద్దది చేయవద్దని మీడియాకు క్లాస్ పీకారు. మీడియా కథనాలతో మరింత మందికి సూదులు గుచ్చాలన్న ఆలోచన రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం నెల్లూరు జిల్లా తడలోని చెక్ పోస్టు వద్ద ఐక్లిక్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం రాముడు మీడియాతో మాట్లాడారు. సైకోను అతిత్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరిపైనైనా అనుమానాలుంటే, దగ్గర్లోని పోలీసు స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. పోలీసు శాఖలో మరింత టెక్నాలజీని చొప్పిస్తామని తెలిపారు.