: 'చదువు' ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అనూష
టెక్నాలజీ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని తనువు చాలించింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఈ ఉదయం జరిగింది. మృతురాలు అనూష ఒంగోలులోని ఓ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని స్థానికులు చెబుతున్నారు. చదువు విషయంలో ఆమెపై ఉన్న ఒత్తిడే ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిందని తెలుస్తోంది. కాగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు, కుటుంబ సభ్యులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆత్మహత్యగా కేసును నమోదు చేసుకున్నప్పటికీ, అనుమానాస్పద మరణంగా భావించి, విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కేవలం ఒత్తిడా? లేక మరేమైన కారణాలున్నాయా? అన్న విషయమై దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.