: నా తప్పులు చెప్పండి, సరిదిద్దుకుని మారతా: చంద్రబాబు


"తప్పులు చేయకుండా ఉండటానికి నేనేమీ మానవాతీతుడిని కాదు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సర్వే జరిపిస్తున్నట్టుగానే నాపైనా సర్వే చేయించుకుంటున్నా. ప్రజలు నాలోని లోపాలు ఎత్తి చూపితే సరిదిద్దుకుని మారతా" అని చంద్రబాబు తెలిపారు. మన వెనకేం జరుగుతోందో తెలుసుకునేందుకే ఈ సర్వేలు. ఫలితాలు అనుకూలంగా లేవని అనుకోకుండా, అందుకు కారణాలు విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాలని ప్రజా ప్రతినిధులకు ఆయన సూచించారు. తాను జరిపించిన ఇటీవలి సర్వేలో రెవెన్యూ, మునిసిపాలిటీలు, పోలీసు, ఆసుపత్రుల్లో అధిక అవినీతి జరుగుతోందని నివేదిక వచ్చిందని ఆయన వివరించారు. పింఛన్ల విషయమై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి నెలా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామని తెలిపారు. కొత్తగా వచ్చిన మంత్రులు తమ శాఖలపై పట్టు సాధిస్తుండగా, సీనియర్లు ఈ విషయంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News